అఫ్గానిస్థాన్ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం తీక్షణంగా గమనించాలని, ఆ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లపై (Modi on Afghanistan) ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ సమస్యకు మూలకారణమైన తీవ్రవాదం, ఉగ్రవాదం సహా.. వాటి పర్యవసనాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటలీ పర్యటనలో (Modi in Italy) ఉన్న ఆయన ఆ దేశ ప్రధానమంత్రి మారియో డ్రాగితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ పరిస్థితిని ఒంటరిగా చూడలేమని ప్రధాని (Modi Italy Tour) నొక్కి చెప్పారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
"సుపరిపాలన అందించడంలో పరిస్థితులను ఎదుర్కోవడంలో వైఫల్యం, అసమర్థతపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. అఫ్గాన్ నుంచి ఎదురయ్యే ప్రతి సమస్యను అంతర్జాతీయ సమాజం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ సమస్యల వల్ల అఫ్గాన్ పౌరులు ఇబ్బందులు ఎదుర్కోకూడదు. అఫ్గాన్ పాలకులు, అఫ్గాన్ పౌరులను వేర్వేరుగా చూడాలి. అవసరమైనవారికి తప్పకుండా మానవతా సహాయం అందించాలి. అఫ్గాన్ పౌరులకు ప్రత్యక్షంగా, ఆటంకం లేకుండా సహాయం అందే చర్యలు తీసుకోవాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మరోవైపు, భావసారూప్యత కలిగిన దేశాలు ఇండోపసిఫిక్ ప్రాంతంలో సహకారం అందించుకోవాల్సిన అభిప్రాయం క్రమంగా బలపడుతోందని శ్రింగ్లా పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్య లీడర్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ (Modi Italy Tour) పాల్గొన్నట్లు తెలిపిన ఆయన.. ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇండో పసిఫిక్ అంశంపై ఇప్పటికే వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకున్నాయని శ్రింగ్లా గుర్తు చేశారు.
టార్గెట్ చైనా?