లండన్‌కు చెందిన ఓ వ్యక్తి.. కార్ బూట్ సేల్కు(అనవసరమైన వస్తువులను అమ్మే ప్రదేశం) వెళ్లాడు. అక్కడ ఓ స్పూన్‌ను చూశాడు. అది చాలా పాతగా, తుప్పుపట్టినట్టు, సగం ఒంగిపోయినట్టు ఉంది. కానీ దానిని చూసిన వెంటనే, అందులో ఏదో ప్రత్యేకత ఉందని ఆ వ్యక్తికి అనిపించింది. ఇక ఆ చెంచాను కేవలం 90 పైసలకు కొన్నాడు.
ఆ తర్వాత.. దానిని వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి.. సోమర్సెట్లోని లారెన్స్ ఆక్షనీర్స్ను సంప్రదించాడు. అక్కడే ఉన్న ఓ నిపుణుడు ఆ 5 ఇంచుల చెంచాను క్షుణ్ణంగా పరిశీలించాడు. అనంతరం అది 13వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించాడు. వేలంలో.. ఆ స్పూన్ ప్రారంభ ధర రూ. 51,712గా నిర్ణయించాడు.