ఈ కాలంలో 40 ఏళ్లు వచ్చేసరికి శరీరం సహకరించడం లేదంటుంటారు చాలామంది. అటువంటిది 60 ఏళ్లు వచ్చినా పదహారేళ్ల పడుచుపిల్లలా ఎగురుతోంది ఈ బామ్మ. ఆమె పేరు టయోకా. ఏ దేశమో తెలియదు కానీ ఓ ఇంగ్లీష్ పాటకు లయబద్ధంగా స్టెప్పులేస్తూ నెటిజన్లందర్నీ మైమరిపిస్తోంది. యువత కూడా ఈర్ష్య పడేలా మెలికలు తిరుగుతోంది. ఈ వయస్సులో కూడా ఇంత బాగా ఎలా డ్యాన్స్ చేయగలుగుతున్నారని చాలా మంది నెటిజన్లు టయోకాను అడిగారట. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపిన టయోకా పాట వినబడితే చాలు తనను తాను మర్చిపోతానంటోంది.
60 ఏళ్ల వయస్సు... పడి పడి లేచే మనస్సు!
ఆ బామ్మది 60 ఏళ్ల వయస్సు. కానీ ఆమెది పడిపడి లేచే మనస్సు. పట్టుకో పట్టుకో... కళ్లెమేసి పట్టుకో అని అందరినీ సవాల్ చేస్తోంది. సంగీతం అంటే చెవికోసుకునే ఆ బామ్మ తన అద్భుత నృత్యంతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
60 ఏళ్ల వయస్సులో దుమ్మురేపుతున్న బామ్మ డాన్స్
ఇప్పటి వరకు ఈ బామ్మ నృత్యాన్ని దాదాపు 40 లక్షల మంది వీక్షించగా 4 లక్షలకు పైగా షేర్స్, 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బహుశా ఈ మధ్యకాలంలో ఇంతగా వైరల్ అయిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో లేదేమో అనేంతగా నెటిజన్లను మెప్పిస్తోంది. కావాలంటే ఈ వీడియో చూడండి. మీ నోటి నుంచి కూడా నిజమే అన్న మాట రాకమానదు..!
ఇదీ చూడండి: 'దంగల్ చిత్రం.. చైనా అధ్యక్షుడ్నే మెప్పించింది'
Last Updated : Oct 16, 2019, 3:27 AM IST