చైనాలో 'యోగా డే'.. ఆసనాలు వేసిన అధికారులు - చైనా బీజింగ్
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు యోగాసనాలు వేశారు. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించినట్లు అధికారులు తెలిపారు.
బీజింగ్ భారత రాయబార కార్యాలయంలో యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చైనాలోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆసనాలు వేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న వేళ భౌతిక దూరం పాటిస్తూ.. యోగా చేసినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సనాతన భారత సంప్రదాయాల్లో భాగమైన యోగా నేడు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.