తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ మైత్రి: కానుకలతో భారత్​కు జిన్​పింగ్​

భారత్​ పర్యటనలో భాగంగా మోదీకి జిన్​పింగ్​ కొన్ని కానుకలను అందివ్వనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగశాఖ ప్రకటించింది. ఈ కానుకలు అగ్రనేతల మధ్య ఉన్న స్నేహ బంధానికి చిహ్నమని తెలిపింది.

మోదీ మైత్రి: కానుకలతో భారత్​కు జిన్​పింగ్​

By

Published : Oct 11, 2019, 5:45 AM IST

Updated : Oct 11, 2019, 5:56 AM IST

మోదీ మైత్రి: కానుకలతో భారత్​కు జిన్​పింగ్​

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ రెండు రోజుల భారత్​ పర్యటన నేడు ప్రారంభంకానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- జిన్​పింగ్​ మధ్య రెండవ అనధికారిక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా తమ స్నేహ బంధానికి చిహ్నంగా మోదీకి పలు కానుకలను ఇవ్వనున్నారు చైనా అధ్యక్షుడు. ఈ విషయాన్ని డ్రాగన్​ దేశ విదేశాంగశాఖ తెలిపింది.

"మోదీతో జిన్​పింగ్​కు ఉన్న స్నేహం, భారత్​- చైనా మధ్య నెలకొన్న గొప్ప ద్వైపాక్షిక సంబంధాలకు చిహ్నంగా ఈ కానుకలు నిలువనున్నాయి."
--- చైనా విదేశాంగశాఖ ప్రకటన.

గత కొన్ని సంవత్సరాల్లో మోదీ-జిన్​పింగ్​ అనేక మార్లు కలుసుకున్నారు. ముఖ్యంగా 2018లో వూహాన్​ వేదికగా జరిగిన తొలి అనధికార సమావేశంతో అగ్రనేతల మధ్య మైత్రి మరింత బలపడింది. ఈ స్నేహమే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉపయోగపడింది.

ప్రముఖ చైనా చిత్రకారుడు బైహాంగ్​ గీసిన చిత్రపటాలను వూహాన్​ సమావేశంలో జిన్​పింగ్​కు కానుకగా ఇచ్చారు మోదీ. విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో బైహాంగ్​ ఉపాధ్యాయుడిగా సేవలందించారు.

ఇదీ చూడండి:-ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మూడేళ్లుగా కుట్ర!

Last Updated : Oct 11, 2019, 5:56 AM IST

ABOUT THE AUTHOR

...view details