యుద్ధానికి సన్నద్ధం కావాలని, దేశానికి పూర్తి విధేయంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తన సైనిక దళాలకు పిలుపునిచ్చారు. చైనా సైన్యం కొత్తగా అభివృద్ధి చేస్తున్న కోర్ దళాన్ని మంగళవారం పర్యవేక్షించిన సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. చైనా అధికారిక మీడియాను ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ఇదీ చూడండి:సుదీర్ఘ చర్చలు ఫలించేనా? ఉపసంహరణ జరిగేనా?
''యుద్ధానికి సన్నద్ధం కావడంపైనే మీ శక్తియుక్తులు, దృష్టినంతటినీ కేంద్రీకరించండి. అత్యంత అప్రమత్తంగా ఉండండి. పూర్తి స్వచ్ఛంగా, విశ్వసనీయంగా ఉండండి.'' అని జిన్‌పింగ్ సైనిక దళాలకు స్పష్టం చేశారు. భారత్‌ను లేదా అమెరికాను లేదా మరే ఇతర దేశాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం కాలేదు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారత్-చైనాల మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇది చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి:లేహ్‌లో రాత్రివేళలోనూ యుద్ధవిమానాల గర్జన