కరోనా వైరస్.. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అయితే వుహాన్‌లో దాదాపు మూడు నెలల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయినా ప్రజల్లో ఆందోళనలు మాత్రం పోలేదు. ఇందుకు కారణం.. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుందనే భయం.
ఎలాంటి లక్షణాలు లేకపోయినా వైరస్ పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య చైనాలో రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వుహాన్‌లో లాక్డౌన్ తొలగించినా... ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.