తెలంగాణ

telangana

ETV Bharat / international

తగ్గని కరోనా ఉద్ధృతి- అమెరికాలో 57 లక్షల కేసులు - కరోనా వైరస్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 2,26,27,039 మందికి వైరస్​ సోకింది. మొత్తం మీద 7,91,885 మంది వైరస్​కు బలయ్యారు. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది.

Worldwide corona virus pandemic situation
తగ్గని కరోనా ఉద్ధృతి- అమెరికాలో 57లక్షల కేసులు

By

Published : Aug 20, 2020, 7:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,26,27,039 మందికి కరోనా​ సోకింది. వైరస్ ధాటికి 7,91,885 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా విలవిల...

అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 947 తాజా కేసులతో కరోనా బాధితుల సంఖ్య 57,01,878కు చేరింది. మరో 40మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ దేశంలో మృతుల సంఖ్య 1,76,377కు పెరిగింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 30,63,252మంది వైరస్​ను జయించి ఇళ్లకు చేరారు.

పాక్​లో...

పాకిస్థాన్​లో 513 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 2,90,958కు పెరిగింది. 24 గంటల్లో 8 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,209కు చేరింది.

నేపాల్​లో...

నేపాల్​లో కొత్తగా 707 కేసులు బయటపడ్డాయి. ఒక్క కాఠ్​మాండూలోనే 200 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా కేసుల సంఖ్య 29,645కు చేరింది. దేశంలో మృతుల సంఖ్య 126గా ఉంది.

దేశం కేసులు మృతులు
అమెరికా 57,01,878 1,76,377
బ్రెజిల్​ 34,60,413 1,11,189
రష్యా 9,42,106 16,099
దక్షిణాఫ్రికా 5,96,060 12,423
పెరూ 5,58,420 26,834
మెక్సికో 5,37,031 58,481
కొలంబియా 5,02,178 15,979
చిలీ 3,90,037 10,578
స్పెయిన్​ 3,87,985 28,797

ఇదీ చూడండి:-కరోనా, సాధారణ జలుబు మధ్య తేడా ఇదే...

ABOUT THE AUTHOR

...view details