తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్‌ విమానం కూలకముందు ఏం జరిగిందంటే? - flight accident in pak

పాక్​ విమాన ప్రమాదం నుంచి బతికి బయట పడిన ఇద్దరిలో ఓ ప్రయాణికుడు ఘటనకు ముందు ఏం జరిగిందో వివరించాడు. కరాచీలో శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 97 మంది మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

What happened before the PIA plane crash explains survivor Muhammad Zubair
పాక్‌ విమానం కూలకముందు ఏం జరిగిందంటే..

By

Published : May 24, 2020, 6:12 PM IST

Updated : May 24, 2020, 6:19 PM IST

పాకిస్థాన్‌లోని కరాచీలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 97 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఓ ప్రయాణికుడు ఘటనకు ముందు ఏం జరిగిందో వివరించాడు. లాహోర్‌లో బయలుదేరిన విమానం కరాచీ వరకు బాగానే వచ్చిందని, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని ముహమ్మద్‌ జుబేర్‌ అనే ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణించగా ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందులో జుబేర్‌ ఒకరు కాగా, మరో వ్యక్తి బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ సీఈవో జఫర్‌ మసుద్‌. కరాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జుబేర్‌ మీడియాతో మాట్లాడాడు.

ఒక్కసారిగా గాల్లోకి..

'పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 8303 విమానం లాహోర్‌ నుంచి సాఫీగానే వచ్చింది. నా సీటు 8ఎఫ్‌. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే.. పైలట్‌ అందర్నీ సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. సరిగ్గా ల్యాండయ్యే సమయానికి విమానం మూడుసార్లు కుదుపులకు గురైంది. రన్‌వేను సమీపించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి పైలట్‌ విమానాన్ని అమాంతం గాల్లోకి పైకిలేపాడు. 10, 15 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాక.. మళ్లీ ల్యాండ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయన చెబుతుండగానే నేను కిందకి చూశాను. మాలిర్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో ఉన్నామని అర్థమైంది. అంతలోనే విమానం జనావాసాల మధ్య కుప్పకూలింది. నేను స్పృహ కోల్పోయి కళ్లు తెరిచి చూసేసరికి అక్కడంతా పొగ వ్యాపించింది' అని జుబేర్‌ తన భయానక అనుభవాన్ని వివరించాడు.

ఇదీ చూడండి:అమెరికా సహా వారందరివి పగటి కలలు: చైనా

Last Updated : May 24, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details