పాకిస్థాన్ సైన్యం మరోసారి తన తలబిరుసుతనాన్ని ప్రదర్శించింది. ఏ దేశంపైనా అణ్వస్త్ర దాడులు మొదటిగా మొదలుపెట్టకూడదన్న నియమం తమకు లేదని స్పష్టం చేసింది. 'కశ్మీర్' అంశంపై భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రధాని వర్సెస్ సైన్యం
పాక్ సైన్య అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ' అణ్వాయుధాలు మొదటిగా ప్రయోగించకూడదనే నియమం పాకిస్థాన్‌కు లేదు' అని తాజాగా ప్రకటించారు. ఇదే అంశంపై ఇటీవలే స్పందించిన పాక్ ప్రధాని.. భారత్‌తో అణుయుద్ధాన్ని పాక్ మొదలుపెట్టదన్నారు. పాక్ సైన్యం ప్రకటన.. ఇమ్రాన్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.