కశ్మీర్ అంశంపై భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తెలిపారు. కశ్మీర్ విషయంలో భారత్‌తో యుద్దానికి సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని ప్రకటించిన మరుసటి రోజే ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో ద్వైపాక్షిక చర్చలను పాకిస్థాన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో అమెరికా లాంటి దేశాల జోక్యాన్ని కోరుకుంటున్న పాక్... ఇప్పటికే పరిష్కార దిశగా ముమ్మర ప్రయత్నాలు చేసింది. భారత్ ఆ ప్రయత్నాలన్నీ వమ్ము చేసింది. కశ్మీర్ తమ అంతర్గత సమస్య అని.. ఈ అంశంలో ఇతర దేశాలేవీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తేల్చి చెప్పారు.
కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇతర దేశాల జోక్యం ఉంటే బాగుంటుందని ఖురేషీ అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను విడుదల చేసిన తర్వాతే భారత్‌తో చర్చలు జరిపే అవకాశం ఉంటుందన్నారు.