తెలంగాణ

telangana

ETV Bharat / international

చారిత్రక శ్మశానం- యువత కష్టంతో పరిశుభ్రం

ఆస్ట్రేలియాలోని ఓ శ్మశానానికి 149 ఏళ్ల చరిత్ర ఉంది. సరైన నిర్వహణ లేక ప్రస్తుతమది శిథిలావస్థకు చేరింది. అక్కడి సమాధులు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిని సౌందర్యాన్ని కోల్పోతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక యువకులు సమాధులకు పూర్వ వైభవం తెచ్చేందుకు నడుం బిగించారు. వచ్చే ఏడాదికి.. శ్మశానం ఏర్పాటు చేసి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా పూర్వ వైభవం తేవాలని సంకల్పించారు.

By

Published : Jul 8, 2019, 6:59 AM IST

Volunteers are now

Volunteers are now

ఆస్ట్రేలియా క్వీన్స్​ల్యాండ్​లోని ఓ శ్మశానం. కొంతమంది యువకులు ఉత్సాహంగా పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 149 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ శ్మశానంలోని తమ పూర్వీకుల సమాధులకు మెరుగులు దిద్దుతున్నారు. కష్టమైనా లెక్కచేయకుండా ఈ పనికి సంకల్పించారు.

ఆస్ట్రేలియా క్వీన్స్​ల్యాండ్​లోని బ్రిస్బేన్​ లో ఉందీ చారిత్రక శ్మశానం. 1870 లో ప్రారంభమైన ఈ శ్మశానం ప్రస్తుతం 20 వేల సమాధులకు నిలయంగా మారింది. ఈ చారిత్రక శ్మశానం భారీ వరదలనూ తట్టుకుని నిలబడింది. కానీ పూర్వ సౌందర్యాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరింది. దీనికి తోడు దశాబ్దాల నిర్లక్ష్యం, పురాతన కాలం నాటి సమాధులైనందు వల్ల అధ్వాన్నంగా మారాయి.

ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి వచ్చే ఏడాదికి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రక శ్మశానానికి వచ్చే ఏడాదిలోగా పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది స్థానిక యువత.

'ఇక్కడి స్మారక స్థూపాల పైన "మరణించినా కానీ మర్చిపోలేదు" అని రాసి ఉంది.. అదే మేము చెప్పాలనుకుంది కూడా...మేము వాళ్లని మర్చిపోలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నాము.'

- ట్రాసీ ఓలివియెరి, సంస్థ సభ్యురాలు

ఈ శ్మశానం చాలా ఆహ్లాదకరమైన ప్రదేశమని, ఆటలూ ఆడుకోవచ్చని ఈ యువకులు అభిప్రాయపడుతున్నారు

కనిపిస్తున్న స్మృతుల చిహ్నాలను బ్రష్​ తో రుద్ది, వాటిపై నీటిని వెదజల్లాలి..అలా తిరిగి చేస్తూనే ఉండాలి.

-జాక్​ చెనోవెత్, స్వచ్ఛంద సేవకుడు

సమాధులను బాగు చేసేందుకు యత్నించడం వల్ల అక్కడి చరిత్రతో ప్రయాణించినట్లు అనిపిస్తుందని యువకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:మాలీలో నరమేధం: 23 మంది ఊచకోత

ABOUT THE AUTHOR

...view details