ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది 'కొవిడ్-19'. వ్యాధి కేంద్రబిందువుగా భావిస్తోన్న చైనాలోని హుబే రాష్ట్రంలో ఒక్కరోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,355 మంది ఈ ప్రాణాంతక వైరస్‌కు బలయ్యారు. 15 వేల నూతన కేసులు నమోదయ్యాయని సమాచారం. దీనితో వ్యాధి సోకిన వారి సంఖ్య 60 వేలకు చేరింది.
'భారత్.. మీ చొరవకు ధన్యవాదాలు'
'కొవిడ్-19' నియంత్రణలో భాగంగా ఓ చైనా జాతీయుడిని ప్రత్యేక శిబిరంలో ఉంచి వైద్య పరీక్షలు చేసింది భారత్. అతడికి వైరస్ సోకలేదని నిర్ధరణ అయిన నేపథ్యంలో డిశ్చార్జీ చేసింది. ఈ నేపథ్యంలో తనకు చికిత్స చేసిన పుణె ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు తెలిపాడు ఆ వ్యక్తి. సోదర భావంతో సేవ చేశారని పేర్కొన్నాడు.
'కొవిడ్-19'పై అమెరికా జాగ్రత్త...