తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2019, 2:00 PM IST

ETV Bharat / international

ప్రయాణానికే కాదు.. ఇక వినోదానికీ కార్లే!

ఓ కారెక్కితే ఆడుతూ పాడుతూ పోవచ్చు. మరో దాన్లో మనమేమీ చేయాల్సిన పని లేకుండానే అన్నీ జరుగుతాయి. ఇంకో వాహనాన్ని చూస్తే దానికదే డ్రైవింగ్ చేస్తుంది. ఇదేమీ హాలీవుడ్​ ఫిక్షన్​ కథ కాదు. భవిష్యత్తులో మనం చూడబోయే నిజం.

కార్లలో ఊహాలలోకం

కార్లలో ఊహాలలోకం

సాంకేతిక విప్లవంతో ప్రపంచంలో ఏటా ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వీటన్నింటినీ ప్రజలకు పరిచయం చేసే వేదికే 'కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో' (సీఈఎస్​). ఈ ఏడాది చైనా షాంఘై నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాహనాల ప్రదర్శన అదిరిపోయింది.

'ఆడి'తో ఊహలలోకానికి...

భవిష్యత్తులో ప్రయాణం ఎలా ఉండబోతుందో కార్ల తయారీ దిగ్గజం 'ఆడి' చూపించేసింది. వాహనాలను వినోద కేంద్రంగా మార్చేస్తోంది. కార్లోనే సినిమా, వీడియో గేమ్స్ ఆడుకునేలా 'హోలో రైడ్​' సంస్థతో కలిసి కొత్త సాంకేతికతను పరిచయం చేస్తోంది.

"గణాంకాలు చూస్తే 25 శాతం మంది ప్రయాణంలో ఉన్నప్పుడు దృశ్యాన్ని ఆస్వాదించలేరు. ఇందుకు కారణం వెళ్లే వేగం, వాళ్లు చూసే అంశంతో సరిపోలకపోవటమే. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మేం మూడు ప్రధాన సాంకేతికతలను ఏకం చేశాం. వాహనానికి అనుసంధానం చేసిన ఐఓటీతో లొకేషన్​, వేగం, బ్రేకింగ్, స్టీరింగ్ స్థానం అన్నింటి సమాచారం ఈ వ్యవస్థ నిక్షిప్తం చేస్తుంది. ఈ ఐఓటీతో కృత్రిమ మేధ, వర్చువల్ రియాల్టీ సెన్సార్లు జోడించి ఊహల లోకంలో విహరించవచ్చు."

-నిల్స్​ వాల్నీ, హోలో రైడ్ సీఈఓ

ఈ కారు వెనక సీట్లో కూర్చున్నప్పుడు హాయిగా వర్చువల్​ ప్రపంచలోకి వెళ్లొచ్చు. ఇందులో వీఆర్​తో పాటు మనం ఎటు వెళుతున్నాం? ఎక్కడికి వెళ్లాలి? బయట ఏం జరగుతుందో కూడా తెలిసిపోతుంది.

స్వతంత్ర చోదక వ్యవస్థ

దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ హ్యుందయ్.. మరో కొత్త అంశంతో ముందుకు వచ్చింది. అదే ఎం-విజన్​ పేరిట రూపొందించిన స్వతంత్ర చోదక వ్యవస్థ. ఇందులో మల్టీడైరెక్షన్​ కెమెరాలు, షార్ట్​కట్, ప్రత్యామ్నాయ​ మార్గాలు, వాతావరణాన్ని గుర్తించటం ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. వీటి సాయంతో మనమేదీ చేయకుండానే అన్నీ జరిగిపోతాయి. కేవలం సినిమా చూస్తూ కూర్చోవాలంతే. మన మూడ్ బట్టి పాటలు, లైట్స్​ థీమ్​ను కూడా మారుస్తుంది. ఇతర వాహనాలకు హెచ్చరికలు, సూచనలు చేస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి!

"ఇందులో ఎన్నో ఆటోపైలట్​ సెన్సార్స్​, లైట్స్​ ఉన్నాయి. మొదటగా ఎం-విజన్​ మన పరిసరాలను గుర్తిస్తుంది. ఈ సమాచారంతో వెనకాల ఉన్న డిజిటల్​ లైట్​తో పరిసరాలతో అనుసంధానం అయి సూచనలు చేస్తుంది."

-ఓహెచ్​ క్వోన్సుక్​, ఎం-విజన్​ డెవలపర్​

చైనా కంపెనీ 'ఇన్సెప్షియో'.. భారీ వాహనాల్లోనూ స్వయం చోదక వ్యవస్థను పరిచయం చేసింది.

ఇదీ చూడండి: పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details