తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​పై అగ్రరాజ్యం ఆంక్షలు - US

వీసాల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా పాకిస్థానీయులకు వీసాల మంజూరు ప్రక్రియను నిలిపేవేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దౌత్య సంబంధాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు ఉన్నతాధికారి.

పాక్​పై అమెరికా ఆంక్షలు

By

Published : Apr 28, 2019, 6:04 AM IST

Updated : Apr 28, 2019, 7:34 AM IST

పాక్​పై ఆంక్షలు

వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలోనే ఉంటున్న పాకిస్థానీయుల పట్ల ట్రంప్​ సర్కార్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని స్వదేశానికి రప్పించేందుకు పాక్​ నిరాకరించిన నేపథ్యంలో... ఆ దేశంపై ఆంక్షలు విధించింది.

'వీసా' సంబంధిత అంశాల్లోనే ఈ ఆంక్షలుంటాయని, దౌత్య సంబంధాల్లో ఎలాంటి మార్పూ ఉండదని పేర్కొన్నారు అధికారులు.

'పాక్​తో దౌత్య సంబంధ విషయాల్లో ఎలాంటి మార్పులుండవు. కానీ... ఆంక్షలు విధిస్తున్నట్లు ఏప్రిల్​ 22న ఫెడరల్​ రిజిస్ట్రార్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీని వల్ల పాకిస్థానీయులకు వీసాల మంజూరు ప్రక్రియను నిలిపివేయవచ్చు' అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

వీసా గడువు ముగిసిన వారిని.. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న పది దేశాల జాబితాలో పాక్​ కూడా చేరింది. ఇదివరకే గయానా, గాంబియా, కంబోడియా, ఎరిట్రియా, గునియా, సియెర్రా లియోన్​, బర్మా, లావోస్​, ఘనా దేశాలపై ఆంక్షలు విధించింది అమెరికా.

మొదటిసారిగా గయానాపై 2001లో చర్యలు తీసుకుంది.

అమెరికా చర్యపై అక్కడి పాక్​ మాజీ రాయబారి​ హుస్సేన్​ హక్కానీ స్పందించారు. ఇకపై అమెరికా వెళ్లాలనుకునే పాకిస్థాన్​ వాసులకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

'ఆయుధాల' ఒప్పందానికి అమెరికా దూరం

Last Updated : Apr 28, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details