తెలంగాణ

telangana

ETV Bharat / international

అదనపు బలగాలు అందుకే : అమెరికా - రివల్యూషనరీ గార్డ్స్​

మధ్య ప్రాచ్యంలో మరిన్ని సైనిక బలగాలను మోహరిస్తోంది అమెరికా. ఇరాన్​తో విబేధాలను తాము కోరుకోవడం లేదని, దేశ ప్రయోజనాల కోసమే ఈ చర్య చేపడుతున్నట్లు అగ్రరాజ్యం వివరించింది.

అదనపు బలగాలు అందుకే : అమెరికా

By

Published : Jun 18, 2019, 10:26 AM IST

అదనపు బలగాలు అందుకే : అమెరికా

ఇరాన్​తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో వెయ్యి అదనపు దళాలను మోహరించడానికి ఆమోదం తెలిపినట్లు అమెరికా ప్రకటించింది.
మధ్య ప్రాచ్యంలో వాయు, నావికా, భూ-ఆధారిత దాడుల నుంచి రక్షణ పొందడానికి మాత్రమే తమ బలగాలను పంపుతున్నట్లు అమెరికా రక్షణ తాత్కాలిక కార్యదర్శి ప్యాట్రిక్​ షానహాన్​ వెల్లడించారు.

"ఇటీవల ఇరాన్​ దళాలు చేపట్టిన దాడుల గురించి విశ్వసనీయ సమాచారం ఉంది. వారి నిఘా సంస్థల అనుచిత చర్యలు... మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి."-ప్యాట్రిక్​ షానహాన్​, అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి

ఒమన్​ గల్ఫ్​లో గత వారం రెండు చమురు ట్యాంకర్లపై జరిగిన దాడులకు ఇరాన్​దే బాధ్యత అని అమెరికా ఆరోపిస్తోంది. తేహ్రాన్ ప్రత్యారోపణలు​ నిరాధారమైనవని అంటోంది.

సాక్ష్యాలివిగో..

చమురు ట్యాంకర్లపై దాడులకు ఇరాన్​దే బాధ్యత అంటూ సాక్ష్యాధారాలుగా కొన్ని ఫొటోలను అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్​ సోమవారం విడుదల చేసింది. 'జపాన్​కు చెందిన కొకుకా చమురు ట్యాంకు నుంచి పేలుడు పదార్ధాలను ఇరాన్ సైనికులు తొలగిస్తున్న దృశ్యాలవి' అని వివరించింది. పర్షియన్​ గల్ఫ్​లో ఈ దాడులను ఇరాన్​కు చెందిన 'రివల్యూషనరీ గార్డ్స్​' చేసిందని ఆరోపించింది.

విభేదాలు కోరుకోవడం లేదు..

"ఇరాన్​తో అమెరికా ఎలాంటి విబేధాలను కోరుకోరుకోవడం లేదు. మధ్య ప్రాచ్యంలో మా సైనికుల భద్రత, సంక్షేమం కోసం, అలాగే అమెరికా ప్రయోజనాల పరిరక్షణ కోసమే అదనపు దళాలను పంపుతున్నాం."-ప్యాట్రిక్ షానహాన్​, అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి

ఇరాన్​తో 'బహుళ దేశాల అణు ఒప్పందం' నుంచి అమెరికా వైదొలిగినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్​పై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. మధ్య ప్రాచ్యంలో తమ దళాలను మోహరించింది. ఇరాన్​కు చెందిన ఎలైట్​ రివల్యూషనరీ గార్డ్స్​ను ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ బ్లాక్ లిస్ట్​లో చేర్చింది.

ఇదీ చూడండి: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముర్సీ హఠాన్మరణం

ABOUT THE AUTHOR

...view details