చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాకు పాకింది. వైరస్ లక్షణాలున్న తొలి కేసు మంగళవారం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
37 ఏళ్ల ఈ వ్యక్తి అమెరికా నుంచి వుహాన్‌ను సందర్శించేందుకు వెళ్లారని, అయితే వైరస్‌కు కేంద్రంగా భావిస్తోన్న సీఫుడ్ మార్కెట్‌ను ఇతను సందర్శించలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితునికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అవే లక్షణాలు...
కరోనా వైరస్‌గా పిలిచే ఈ అంటువ్యాధిని మొదటిసారి చైనా, హాంకాంగ్ భూభాగాల్లో గుర్తించారు. ఇది 'సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్' (సార్స్) వైరస్ లక్షణాలు కలిగి ఉన్నట్లు నిపుణులు తెలిపారు. 2003లో ఈ వైరస్ కారణంగా సుమారు 650 మంది మరణించారు. ప్రస్తుతం సుమారు 291 మంది ఈ కొత్త వైరస్‌తో బాధపడుతున్నారు.