ఉత్తర కొరియా ఇటీవల చేపడుతున్న వరుస క్షిపణి ప్రయోగాలపై (North Korea missile test) అమెరికా, ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అధునాతన సాంకేతికతలో ఉత్తర కొరియా పురోగతిని చూసి.. అత్యవసరంగా ఆంక్షలు (North Korea UN sanctions) విధించాలని ఐరాసను కోరాయి. సైనిక కార్యక్రమాలతో పాటు, ఆర్థిక కార్యకలాపాలపైనా ఆంక్షలు (North Korea sanctions) అమలు చేయాలని పేర్కొన్నాయి.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై (North Korea missile test 2021) ఐరాసలో అంతర్గతంగా చర్చ జరిగింది. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్... ఉత్తర కొరియా (North Korea news) నిర్లక్ష్యపు పోకడలను మానుకోవాలని హెచ్చరించారు. ఎలాంటి షరతులు లేకుండా బైడెన్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాలని సూచించారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని హితవు పలికారు.
"ఉత్తర కొరియా పట్ల తమకు(అమెరికాకు) ఎలాంటి శత్రుత్వం లేదు. ఆ దేశ అధికారులతో చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఎలాంటి ముందస్తు షరతులు విధించకుండా బైడెన్ యంత్రాంగంతో చర్చలు ప్రారంభించాలి. నిధులు, సాంకేతికత అందకుండా.. కొరియాపై ఆంక్షలు విధించాలని ఐరాసను కోరుతున్నాం."