జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్తామన్న పాకిస్థాన్‌కు ఏ దేశమూ మద్దతుగా నిలిచే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ విషయంలో దాయాది దేశం ఏకాకి అయ్యేలా ఉంది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి.. ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి తీర్మానాలను భారత్ ఉల్లంఘించిందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించేందుకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి దుజారిక్ నిరాకరించారు. కశ్మీర్ ప్రాంతంలో నెలకొన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
భారత్‌తో బ్రిటన్ సంభాషణ
కశ్మీర్ పునర్విభజన అంశంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌తో సంభాషించినట్లు చెప్పారు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్. ఈ విషయంపై భారత్ స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు. తాము ఆందోళన చెందుతున్న విషయాలను భారత్‌కు చెప్పినట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతియుతంగా ఉండాలని భారత్‌కు సూచించినట్టు చెప్పారు రాబ్.
భారత్‌కు మాల్దీవుల మద్దతు