తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సిన్​ పరిశోధనలే లక్ష్యంగా రష్యా హ్యాకింగ్​!

రష్యా తమ వ్యాక్సిన్​ పరిశోధనలను దొంగలించడానికి యత్నిస్తోందని బ్రిటన్​, అమెరికా, కెనడా దేశాలు ఆరోపించాయి. రష్యా నిఘా వ్యవస్థకు చెందిన కోజీ బేర్​.. దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నాయి.

UK, US, Canada accuse Russia of hacking virus vaccine trials
వ్యాక్సిన్​ పరిశోధనల దొంగలింతకు రష్యా యత్నం!

By

Published : Jul 16, 2020, 7:48 PM IST

కరోనా వ్యాక్సిన్​కు సంబంధించి తమ​ పరిశోధనలను దొంగలించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని బ్రిటన్​, అమెరికా, కెనడా ఆరోపించాయి. కోజీ బేర్​గా పిలిచే ఏపీటీ29 హ్యాకింగ్​ బృందం.. తమ ఎకాడమీ, ఫార్మా పరిశోధన వ్యవస్థలపై దాడి చేస్తోందని పేర్కొన్నాయి. ఈ కోజీ బేర్​.. రష్యా నిఘా సంస్థకు చెందినదిగా వెల్లడించాయి.

అమెరికా, కెనడా సమన్వయంతో.. ఈ విషయాన్ని బ్రిటన్​కు చెందిన సైబర్​ సెక్యూరిటీ సెంటర్​​ ప్రకటించింది. అయితే ఈ దాడులు పరిశోధనను దెబ్బతీయడానికి కాదని.. వాటి ఫలితాలను దొంగలించడానికే జరుగుతున్నాయని అధికారులు తేల్చిచెబుతున్నారు.

ఇప్పటివరకు ఎటువంటి కీలక సమాచారాన్ని దొంగలించలేదని బ్రిటన్​ సైబర్​ సెక్యూరిటీ సెంటర్​ తెలిపింది. ఈ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు తెలుసా? లేదా? అన్నది కూడా అస్పష్టంగానే ఉంది.

2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్​ జాతీయ కమిటీ కంప్యూటర్​ నెట్​వర్క్​లోకి చొరబడి విలువైన ఈ-మెయిల్స్​ను దొంగలించిన రెండు బృందాల్లో కోజీ బేర్​ ఒకటని అమెరికా గుర్తించింది.

ఇదీ చూడండి:-రష్యా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి!

ABOUT THE AUTHOR

...view details