నేపాల్‌కు చెందిన 150 హెక్టార్లకుపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని బ్రిటన్ పత్రిక 'ది టెలిగ్రాఫ్' కథనం వెల్లడించింది. రెండు దేశాల సరిహద్దు సమీపంలోని అయిదు జిల్లాల్లో ఈ భూమిని డ్రాగన్ కబళించిందని, సహజసిద్ధ సరిహద్దుగా ఉన్న ఒక నదిలో నీళ్ల ప్రవాహాన్నీ దీని కోసం మళ్లించిందని బయట పెట్టింది.
నేపాల్‌లో 150 హెక్టార్లను ఆక్రమించిన చైనా...! - నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా
భూబకాసురుడిలా తయారైన చైనా తాజాగా నేపాల్‌కు చెందిన 150 హెక్టార్ల భూభాగాన్ని ఆక్రమించినట్లు ఓ బ్రిటన్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే చైనా ఈ వ్యాఖ్యలను ఖండించింది.
నేపాల్‌లో 150 హెక్టార్లను ఆక్రమించిన చైనా...!
"సరిహద్దులో గస్తీ లేనిచోట్లకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని పంపించి, మే నుంచి క్రమక్రమంగా భూమిని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. హద్దులుగా ఉన్న రాతి స్తంభాలను పక్కకు జరిపేసింది. తర్వాత ఈ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను నెలకొల్పింది. హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాల్లో పాగా వేసే వ్యూహంతోనే దీనికి పాల్పడింది." అని పేర్కొంది.
తాము నేపాల్‌కు చెందిన ఎలాంటి భూమిని ఆక్రమించుకోలేదని చైనా స్పష్టం చేసింది. ఇవి పూర్తి వందుతులేనని కొట్టిపారేసింది.