తుపాను బీభత్సం కారణంగా తూర్పు ఫిలిప్పీన్స్ ప్రాంతం అతలాకుతలం అయింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేశారు.
ఫిలిప్పీన్స్లో తుపాను బీభత్సం గంటకు 225 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న గోని తుపాను ఈదురు గాలుల కారణంగా ఫిలిప్పీన్స్లోని కటండుయేన్స్ ద్వీపం భారీగా ప్రభావితమైంది. ఇప్పటికే వారం క్రితం వచ్చిన తుపాను వల్ల 22 మంది మృతిచెందగా.. చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
మరో నాలుగు ప్రాంతాల్లో..
కటండుయేన్స్తో పాటు ఆల్బే మొదలైన ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ పేర్కొంది. మయోన్ అగ్నిపర్వత సమీప ప్రాంతం ప్రజలను ముందుగా సురక్షిత స్థలాలకు తరలించినట్లు తెలిపింది. 13 మిలియన్ల ప్రజలు నివసిస్తోన్న మనీలా ప్రాంతంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో గోని తుపాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'బైడెన్ నా సోదరుడు'- 'ట్రంప్ ఓ యోధుడు'