తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాను వణికిస్తున్న లేకిమా...49కి చేరిన మృతులు - ఆస్తి నష్

చైనాలో లేకిమా తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి మృతుల సంఖ్య 49కి చేరింది. మరో 21 మంది ఆచూకీ లేదు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

చైనాను వణికిస్తున్న లేకిమా...49కి చేరిన మృతులు

By

Published : Aug 13, 2019, 11:43 AM IST

Updated : Sep 26, 2019, 8:31 PM IST

చైనాను వణికిస్తున్న లేకిమా...49కి చేరిన మృతులు

డ్రాగన్​ దేశం చైనాపై లేకిమా తుపాను విలయతాండవం చేసింది. భారీ వర్షాలకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది ఆచూకీ లేదు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ముంపునకు గురైన ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.

ప్రధానంగా జెజియాంగ్, షాందాంగ్, అన్​హుయ్​ రాష్ట్రాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. వరద ఉద్ధృతికి ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి.

జెజియాంగ్​ రాష్ట్రంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. "షాందాంగ్​లో 1952 తర్వాత ఇప్పుడే అత్యధిక వర్షపాతం నమోదైందని" అధికారులు తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా 26 బిలియన్​ యువాన్లు (3.7 బిలియన్​ డాలర్ల) ఆస్తి నష్టం వాటిల్లింది.

ఇదీ చూడండి:పాక్​ను ముంచెత్తిన వరదలు..28 మంది మృతి.

Last Updated : Sep 26, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details