తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ 'కశ్మీర్​' ఆఫర్​ ఊహించలేదు: ఖురేషి - పాక్​ విదేశాంగ మంత్రి

కశ్మీర్​ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహిస్తానని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్​ ప్రకటనను ఊహించని పరిణామంగా పేర్కొన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషి.

ట్రంప్ ఆఫర్​ ఉహించలేదు: పాక్​ విదేశాంగ మంత్రి

By

Published : Jul 29, 2019, 5:12 AM IST

Updated : Jul 29, 2019, 8:06 AM IST

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేసిన​ వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది.తాజాగా ఈ విషయంపై పాక్​ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషి స్పందించారు.అగ్రరాజ్యం అధ్యక్షుడి నుంచి ఇంతకంటే ఎక్కువగా తాము ఏమీ ఆశించలేదని చెప్పారు ఖురేషి. పాక్​లోని ఓ న్యూస్​ ఛానల్​తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ పాకిస్థాన్​కు ఊహించని ఆఫర్​ ఇచ్చారన్నారు.

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​... ట్రంప్​ ప్రకటనను స్వాగతించారు. కానీ ట్రంప్​ వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. అమెరికాలోనూ ట్రంప్​ వ్యాఖ్యలపై విమర్శలు ఎదురయ్యాయి.

ఇదీ చూడండి: అఫ్గాన్ ఉపాధ్యక్ష అభ్యర్థి లక్ష్యంగా బాంబు దాడి

Last Updated : Jul 29, 2019, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details