చైనాతో వాణిజ్య ఒప్పందానికి సుముఖంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు కృషి చేయాల్సిందేనని పేర్కొన్నారు. జీ-20 సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో జరిగిన భేటీలో పలు అంశాలపై ట్రంప్ మాట్లాడారు.
"మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. మన మధ్య మంచి అనుబంధం ఉంది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మనం ఏదైనా చేయాలి. నాకు తెలిసి ముగింపునకు మనం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం సరైన దిశగా ఒప్పందం కుదుర్చుకుంటే చరిత్రలో నిలిచిపోతాం. ఒప్పందం విషయంలో అమెరికా పారదర్శకంగా ఉంది. ఇది ఎంతో కీలకమైన సమావేశం. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిద్దాం. ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు."