తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-20 సదస్సు: ట్రంప్​తో మోదీ ద్వైపాక్షిక భేటీ - ట్రంప్

జపాన్​లో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా లాంఛనంగా సమావేశం అయ్యారు.

జీ-20 సదస్సు

By

Published : Jun 28, 2019, 9:25 AM IST

Updated : Jun 28, 2019, 1:22 PM IST

జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం అయ్యారు. జపాన్​లో జరుగుతున్నఈ సదస్సు ప్రారంభం సందర్భంగా లాంఛనంగా ఇరు దేశాల అధినేతల భేటీ జరిగింది.

ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించకుంది. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ట్రంప్​తో భేటీ అయ్యారు మోదీ. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మోదీకి ట్రంప్​ అభినందనలు తెలిపారు.

ట్రంప్​తో మోదీ ద్వైపాక్షిక భేటీ

అమెరికా ఉత్పత్తులపై భారత్​ అధిక పన్నులు వసూలు చేస్తోందని ట్రంప్​ చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్​కు జీఎస్​పీ హోదాను తొలగించింది అగ్రరాజ్యం. జపాన్​లో అడుగు పెట్టగానే పన్నుల విషయమై మోదీతో చర్చిస్తానని ఇంతకుముందే ట్రంప్​ ట్వీట్​ చేశారు.

"కొన్నేళ్లుగా అమెరికా ఎగుమతులపై భారత్​ వసూలు చేస్తోన్న అధిక పన్నుల విషయంపై మోదీతో చర్చిస్తాను. అంతేకాకుండా మళ్లీ మరికొంత సుంకాన్ని పెంచారు. ఈ విషయం అంగీకరించదగినది కాదు. సుంకాన్ని పూర్తిగా తొలగించాలి."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

'జై' కూటమి

ఈ సమావేశానికి ముందు జపాన్​, అమెరికా, భారత్​ (జై) దేశాధినేతలు త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఈ బృందంలో భారత్ ప్రాముఖ్యంపై ట్రంప్​, జపాన్​ ప్రధాని షింజో అబేకు వివరించారు మోదీ.

ఇదీ చూడండి: 'కార్ల నుంచి బుల్లెట్​ రైళ్లు తయారు చేసే స్థాయికి'

Last Updated : Jun 28, 2019, 1:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details