అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ నెలాఖరున భారత్లో మొట్టమొదటిసారి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్పందించారు ట్రంప్ సతీమణి, అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. భారత్-అమెరికా దేశాల సత్సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ స్పందించిన ఆమె.. ఈ మేరకు ట్వీట్ చేశారు.
" భారత పర్యటనకు ఆహ్వానించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ నెలాఖరులో దిల్లీ, అహ్మదాబాద్ నగరాలను సందర్శించటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పర్యటన వల్ల భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నాను."
-మెలానియా ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ.