తెలంగాణ

telangana

ETV Bharat / international

చెర్రీ పూలతో జపాన్​కు నవవసంతం

జపాన్​లో వసంతకాలం ప్రవేశించింది. ఈ కాలంలో మాత్రమే పూచే చెర్రీ పూలను చూడడానికి ప్రకృతి ప్రేమికులు టోక్యో నగరానికి చేరుకుంటున్నారు.

By

Published : Mar 28, 2019, 6:02 AM IST

చెర్రీ పూలతో జపాన్​కు నవవసంతం

చెర్రీ పూలతో జపాన్​కు నవవసంతం

చెర్రీ పూల సోయగంతో జపాన్​లో వసంతకాలం ప్రవేశించింది. విరబూసిన ఈ పుష్పాలను చూడడానికి ప్రకృతి ప్రేమికులు టోక్యో నగరానికి చేరుకుంటున్నారు.

జపాన్​లో చెర్రీ పూలు పూయడంతోనే వసంతకాలం ప్రవేశిస్తుందని స్థానికులు భావిస్తారు. టోక్యో నగరానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. లేత గులాబీ, శ్వేత రంగుల్లో మెరిసిపోతున్న ఈ పుష్పాలు చూసి ఆనందంతో పరవశిస్తున్నారు. మరో వారం రోజులు మాత్రమే ఈ పూలు పూస్తాయి. కనుక వీటిని తమ కెమెరాల్లో బంధించేందుకు పర్యటకులు పోటీపడుతున్నారు.

ఇదీ చూడండి :ఏనుగు అలిగింది... తొమ్మిది కార్లు నలిగాయి!

ABOUT THE AUTHOR

...view details