భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్... అక్టోబర్లో సమావేశం కానున్నారు. ఇందుకు తమిళనాడులోని సముద్ర తీర నగరమైన మామళ్లపురం వేదికయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మోదీ-జిన్పింగ్ సమావేశం రెండు రోజులు జరగుతుందని చెప్పారు ఆ అధికారి. ఈ భేటీ కోసం మామళ్లపురంతోపాటు దేశంలోని ఇతర ప్రముఖ నగరాల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగరాల గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.