తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​లో ఘనంగా​ 'ఇంద్ర జాత్రా' ఉత్సవాలు - ఖాట్మండు

నేపాల్​ రాజధాని కాఠ్మాండులో ఇంద్ర జాత్రా ఉత్సవం వైభవంగా జరిగింది. దేశ నలుమూలల నుంచి వేలాది మంది నగరానికి చేరుకుని లివింగ్​ గాడెస్ 'కుమారి' ఆశీర్వాదం తీసుకున్నారు. వివిధ వేషధారణలు, నృత్యాలతో జరిగిన ఉత్సవాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

నేపాల్​లో ఘనంగా​ జీవన దేవత ఆశీర్వాద ఉత్సవాలు

By

Published : Sep 14, 2019, 6:31 AM IST

Updated : Sep 30, 2019, 1:15 PM IST

నేపాల్​లో ఘనంగా​ జీవన దేవత ఆశీర్వాద ఉత్సవాలు
నేపాల్​లో ప్రతి ఏటా నిర్వహించే ఇంద్ర జాత్రా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని కాఠ్మాండులో నిర్వహించే ఉత్సవాలకు వేలాది మంది హాజరయ్యారు. స్థానికంగా 'కుమారి'గా పిలుచుకునే జీవన దేవత (లివింగ్​ గాడెస్​) ఆశీర్వాదం తీసుకున్నారు. వివిధ వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. డోలు వాద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు ప్రజలు.

ఇంద్ర జాత్రా ఉత్సవాలను నేపాల్​లోని హిందువులు, బౌద్ధులు కలిసి నిర్వహిస్తారు. పురాతన కాలం నుంచి నెవార్​ జాతికి చెందిన ఓ యువతిని కుమారి (దేవత)గా కొలుస్తారు. ఆమెను రథంలో కూర్చోబెట్టి కాఠ్మాండు వీధుల్లో ఊరేగిస్తారు.

వర్షాకాలం ముగిసే సమయంలో ప్రతి ఏటా ఈ ఇంద్ర జాత్రా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకతో అక్కడ పండుగలు మొదలవుతాయి.

ఇదీ చూడండి:చైనా: 'మిడ్​ ఆటమ్​' వేడుక.. సంప్రదాయాల కలయిక

Last Updated : Sep 30, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details