చైనాపై విరుచుకుపడిన కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇప్పటివరకు 1,800మంది బలయ్యారు. 70వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది వుహాన్ నగరానికి చెందినవారు ఉన్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాక, ప్రపంచ దేశాలపైనా పంజా విసురుతోంది. తైవాన్, హాంకాంగ్, జపాన్ దేశాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా.. శనివారం తమ దేశంలో తొలి మరణాన్ని ప్రకటించింది ఫ్రాన్స్.
కరోనా పంజా: ఏ దేశంలో ఎన్ని కేసులు?
కొవిడ్-19 (కరోనా) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనాలో వందలాది మంది మృత్యువాతపడుతున్నారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకు వేర్వేరు దేశాల్లో నమోదైన కేసుల వివరాలు ఓసారి చూద్దాం.
కరోనా పంజా: ఏ దేశంలో ఎన్ని కేసులు?
వివిధ దేశాల్లో నమోదైన కేసులు, మరణాలు వివరాలు
సింగపూర్ | 75 |
జపాన్ | 58, ఓ మహిళ మృతి |
హాంకాంగ్ | 57, ఒకరు మృతి |
థాయ్లాండ్ | 34 |
దక్షిణ కొరియా | 30 |
మలేసియా | 22 |
తైవాన్ | 19, ఒకరు మృతి |
వియత్నాం | 16 |
ఆస్ట్రేలియా | 15 |
మకావ్ | 10 |
భారత్ | 3 |
ఫిలిప్పీన్స్ | 2, ఒకరు మృతి |
నేపాల్ | 1 |
శ్రీలంక | 1 |
కంబోడియా | 1 |
అమెరికా | 15 |
కెనడా | 8 |
ఫ్రాన్స్ | 11, ఒకరు మృతి |
బ్రిటన్ | 9 |
ఇటలీ | 3 |
రష్యా | 2 |
స్పెయిన్ | 2 |
ఫిన్లాండ్ | 1 |
స్వీడన్ | 1 |
బెల్జియం | 1 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 9 |
ఈజిప్ట్ | 1 |
ఇదీ చూడండి:తల్లికి కరోనా వైరస్.. మరి ఇప్పుడే పుట్టిన పాపకు?
Last Updated : Mar 1, 2020, 2:44 PM IST