థాయ్‌లాండ్ రాజు పట్టాభిషేకం ఉత్సవాలు బ్యాంకాక్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. తమ ప్రియమైన రాజు కలకాలం వర్ధిల్లాలని రాత్రి వేళ డ్రోన్లకు వివిధ రకాల లైట్లు అమర్చి 'లాంగ్ లివ్ ద కింగ్' అని ఆకాశంలో రాశారు. ఈ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
థాయ్ కొత్త రాజుకు డ్రోన్ వెలుగులతో వందనం - Thailand
థాయ్‌లాండ్ రాజు పట్టాభిషేకం వేడుకల్లో భాగంగా నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలు అమర్చిన డ్రోన్లు రకరకాలు విన్యాసాలు చేస్తూ... చూపరులను కట్టిపడేశాయి.
థాయ్‌లాండ్ రాజుగా మహా వజిరలాంగ్‌కోర్న్ శనివారం అధికారికంగా పట్టాభిషిక్తులయ్యారు. 2016లో ఆయన తండ్రి భూమిబోల్ అదుల్యదేజ్ కాలధర్మం చెందగా... వజిరలాంగ్‌కోర్న్‌కు సదరు బాధ్యతలు సంక్రమించినప్పటికీ సంతాపకాలం పూర్తయ్యేదాకా పట్టాభిషేకాన్ని వాయిదా వేశారు. శనివారం హిందూ, బౌద్ధ సంప్రదాయానుసారం... జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో ఆయనకు స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. 1932లో చక్రవర్తుల పాలన ముగిసినప్పటినుంచి థాయ్‌లాండ్‌లో రాజ్యాంగబద్ధమైన రాచరికం ఉంది.
ఇదీ చూడండి : పోలీసు సంస్కరణల్లో తెలుగు రాష్ట్రాలు భేష్