తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆల్​ఖైదాకు తాలిబన్ల అండ- అమెరికా గుండెల్లో​ గుబులు!

తాలిబన్ల(Taliban news) ఆక్రమణతో అఫ్గనిస్థాన్‌ ఇప్పుడు ఓ కన్నీటి సంద్రంలా మారింది. ప్రతి అఫ్గానీయుడి గుండె అంతులేని దుఖఃసాగరమే. తాలిబన్ల ఆక్రమణతో తమ భవిష్యత్తును తలచుకుని అక్కడి ప్రజలంతా ఆందోళన చెందగా.. కేవలం ఆ దేశమే కాకుండా యావత్‌ ప్రపంచం ఇప్పుడు కొత్త ముప్పు ముంగిట నిలిచింది. 20 ఏళ్లుగా నిర్వీర్యమైన ప్రమాదకర అల్‌ఖైదా (Al-Qaida) ఉగ్ర సంస్థ.. తాలిబన్ల దన్నుతో మళ్లీ క్రియాశీలం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది!

al-Qaida
అల్​ఖైదాకు తాలిబన్ల అండ!

By

Published : Aug 24, 2021, 2:51 PM IST

అఫ్గానిస్థాన్​లో(Afghanistan news) మెరుపు వేగంతో మారుతున్న పరిణామాలు.. అమెరికాపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనికి తోడు ఆల్​ఖైదా రూపంలో అగ్రరాజ్యాన్ని మరో ముప్పు కలవరానికి గురి చేస్తోంది. 20 ఏళ్లుగా నిర్వీర్యమైన అల్​ఖైదా.. తాలిబన్ల అండతో మళ్లీ పుంజుకుంటుందనే చర్చ నేపథ్యంలో అమెరికా గుండెల్లో మళ్లీ గుబులు మొదలైంది.

చీకటి రోజు..

2001 సెప్టెంబర్‌ 11.. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అది చీకటి రోజు. యావత్‌ ప్రపంచం అంతకుమునుపు ఎన్నడూ చూడని.. సరికొత్త తరహా ఉగ్రదాడి జరిగిన రోజు. ఒక రకంగా అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచమంతటికీ..... అది చీకటి రోజే. అమెరికా గుర్తింపునకు ప్రతీకగా చెప్పుకునే డబ్ల్యూటీసీ జంట భవనాలను విమానాలతో ఢీ కొట్టి.. వేల మంది ప్రాణాలను హరించింది ఆ రోజే. ఆల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రపంచం అంతా నిర్ఘాంతపోయిన ఆ ఘటనకు పాల్పడింది.

అఫ్గానిస్తాన్‌ కేంద్రంగా..

అమెరికాపై విద్వేషాన్ని చాటే ఆల్‌-ఖైదాకు ప్రధాన కేంద్రం అఫ్గానిస్తాన్‌. అమెరికా లక్ష్యంగా అనేక ఉగ్రదాడులకు పాల్పడిన ఈ సంస్ధ..డబ్ల్యూటీసీ టవర్లపై దాడితోనే వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు అఫ్గానిస్థాన్‌లో అమెరికా సాగించిన ఉగ్రవాదంపై పోరు.. ప్రధానంగా ఆల్‌ ఖైదా లక్ష్యంగానే జరిగింది. 2001 నుంచి 2021 వరకు సాగిన ఈ పోరాటంలో... ఒక రకంగా ఆల్‌ఖైదా దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది. దాని కార్యకలాపాలు కూడా..ఎక్కువగా లేకుండా పోయాయి. అయితే.. ఇప్పుడు అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో.. మళ్లీ ఈ ఉగ్ర సంస్థ క్రియాశీలకమయ్యే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ హయాంలో.. అమెరికా ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేసిన క్రిస్‌ కోస్టా స్వయంగా అంగీకరించారు.

డబ్ల్యూటీసీ టవర్లపై దాడికి ముందు ఆల్‌ఖైదా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది.. తాలిబన్‌లే. తాలిబన్‌, అల్‌ఖైదా భావజాలం ఒకటే. ఇద్దరి ఉమ్మడి శత్రువు అమెరికాయే.అఫ్గానిస్థాన్‌లో ఇప్పటికీ అల్‌ఖైదా సానుభూతిపరులు.. అనేక మంది ఉన్నారు.

తాలిబన్ల దురాక్రమణతో..

ఆల్‌ఖైదా మళ్లీ క్రియాశీలకమయ్యే ప్రమాదం ఉందని.. అమెరికా పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బే... అంచనా వేశారు. అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిణామాలను అనుకూలంగా మార్చుకుని, తమ కేడర్‌ను బలోపేతంచేసుకోవడం, ప్రజల్లోకి భావజాలాన్ని విస్తరించడం, సానుభూతిపరులను తమ వైపు మళ్లించుకోవడం వంటి కార్యకలాపాలపై.. దృష్టి సారించే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి.. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం...ఆల్ ఖైదా సీనియర్‌ నాయకత్వం అఫ్గన్‌లో ఇంకా క్రియాశీలకంగానే ఉందని చెప్పడం మరింత ఆందోళన కల్గిస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details