పాకిస్థాన్‌లోని దక్షిణ కందహార్ ప్రావిన్స్‌లో ఉన్న అఫ్గాన్ ప్రధాన సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. పాక్‌లోని ప్రధాన ఓడరేవులను అనుసంధానం చేసే అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకదానిని తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొంది. అఫ్గాన్‌లోని వెష్, పాక్‌లోని చమన్ నగరాలకు సరిహద్దుగా ఉండే క్రాసింగ్ గేట్ వద్ద అఫ్గాన్ జెండాను వారు తొలగించినట్లు చెప్పింది. ఇదే విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.
"బోల్ధాక్, చమన్ మధ్య ముఖ్యమైన రహదారి మా నియంత్రణలోకి వచ్చింది. ఇస్లామిక్ ఎమిరేట్ పట్టణంలోని వ్యాపారులకు, నివసించే ప్రజలందరి భద్రతను కఠినతరం చేస్తామని హామీ ఇస్తున్నాం."
- జబీహుల్లా, తాలిబాన్ ప్రతినిధి