మిత్రపక్ష దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావటంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని(Taliban Government Oath) తాలిబన్లు వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. ఈనెల 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు(Taliban news).. సెప్టెంబర్ 11న న్యూయార్క్ ట్విన్ టవర్లపై దాడికి (9/11 Attack) 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు.
ఆ దేశాలకు ఆహ్వానం..
పాకిస్థాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్, ఖతార్ తదితర దేశాలకు తాలిబన్లు ఈ మేరకు ఆహ్వానం పంపగా.. రష్యా సహా కొన్ని మిత్రదేశాలు సెప్టెంబర్ 11న జరిగే కార్యక్రమానికి హాజరుకాలేమని పేర్కొన్నట్లు సమాచారం. అమానవీయ ఘటన జరిగినరోజు తాలిబన్లు(Afghanistan Taliban) నిర్వహిస్తున్న మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావద్దని అమెరికా.. ఖతార్‌పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాలిబన్లు తమ కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవాన్ని(Taliban Government Oath) వాయిదా వేసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:అమెరికా విమానం రెక్కకు తాడుకట్టి ఊయలూగిన తాలిబన్లు..!