తెలంగాణ

telangana

గవర్నర్​ లక్ష్యంగా బాంబు దాడి- 8 మంది దుర్మరణం

By

Published : Oct 5, 2020, 6:58 PM IST

​తూర్పు అఫ్గాన్​లోని లాగ్మాన్​​ రాష్ట్ర​ గవర్నర్​ రహ్మతుల్లా యర్మాల్​ లక్ష్యంగా కారుబాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది సహా మరో నలుగురు పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. 38 మందికి గాయాలు అయ్యాయి.

Suicide car bomb targets Afghan governor and 8 members killed
అఫ్గాన్​ గవర్నర్​ లక్ష్యంగా కారు బాంబు.. 8 మంది దుర్మరణం

అఫ్గానిస్థాన్​లోని లాగ్మాన్​ గవర్నర్​ రహ్మతుల్లా యర్మాల్​ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది మరణించారు. వీరిలో నలుగురు పౌరులు. మరో 38 మంది క్షతగాత్రులయ్యారు. గవర్నర్​ సురక్షితంగా బయటపడ్డారు.

పేలుళ్లు వెనక ఎవరి హస్తం ఉందనే దానిపై స్పష్టత లేదు. ఇస్లామిక్​ స్టేట్​​, తాలిబన్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లాగ్మాన్​కు సమీపంలో ఉన్న నంగర్‌హార్ రాష్ట్రంలో శనివారం ఇదే తరహాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతి చెందారు. వీరంతా మధ్యాహ్నం ప్రార్థన సమయంలో గుమ్మిగూడి ఉండగా పేలుడు జరిగింది.

ఇదీ చదవండి:పాక్​ 'బ్లాక్​లిస్ట్'​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

ABOUT THE AUTHOR

...view details