ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన దారుణ మారణహోమంలో ఇప్పటి వరకు 253 మంది మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. లెక్కల్లో తలెత్తిన పొరపాటు కారణంగా ముందుగా 350కి పైగా మరణించారని వార్తాలొచ్చాయని వివరణ ఇచ్చింది. అది కేవలం అంచనా మాత్రమేనని పేర్కొంది. మొత్తం 485 మంది గాయపడ్డారని తెలిపింది. ఇంకా 149 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని శ్రీలంక ఆరోగ్యాధికారి డాక్టర్ అనిల్ జాసింఘే తెలిపారు. మృతుల్లో 11 మంది భారతీయులు సహా మొత్తం 40 మంది విదేశీయులున్నారు.
మసీదులకు కట్టుదిట్టమైన భద్రత
ఆదివారం వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇస్లామిస్ట్ అతివాద సంస్థ నేషనల్ తాహీద్ జమాత్ ఈసారి మసీదులను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం దాడులు జరిపే ప్రమాదముందని శ్రీలంక నిఘా వర్గాలు హెచ్చరించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి. మసీదుల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధారణ ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు.
గ్రనేడ్లు కలిగిన ముగ్గురు అనుమానితుల అరెస్టు