తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆగస్టులో శ్రీలంక పార్లమెంట్​కు ఎన్నికలు

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలను ఆగస్టుకు వాయిదా వేసింది ఆ దేశ ఎన్నికల కమిషన్. మార్చి 2న రద్దయిన పార్లమెంట్ ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ వాయిదా పడటం ఇది రెండోసారి. అయితే అధికార పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

lanka election
ఆగస్టులో శ్రీలంక పార్లమెంట్​కు ఎన్నికలు

By

Published : Jun 11, 2020, 5:58 AM IST

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలకు మరోసారి తేదీని ఖరారు చేశారు ఆ దేశ ఎన్నికల కమిషన్ ఛైర్మన్ మహింద దేశప్రియ. ఆగస్టు 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మార్చి 2న ఆరునెలలు ముందస్తుగా పార్లమెంట్​ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ రెండుసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 25న పోలింగ్ జరగాల్సి ఉండగా.. దానిని జూన్ 20కి వాయిదా వేశారు. వైరస్ ఉద్ధృతి తగ్గని కారణంగా తాజాగా ఆగస్టు 5కు పోలింగ్ తేదిని మార్చారు.

అయితే అధికార పార్టీకి మేలు చేకూర్చేందుకే ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీని వాయిదా వేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం శ్రీలంక సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే ఈ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది.

ఇదీ చూడండి: చెప్పుల ద్వారా కూడా కరోనా- తస్మాత్​ జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details