ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) సమావేశాలు వచ్చేవారం జెనీవాలో ప్రారంభం కానున్న తరుణంలో భారత్ మద్దతు కోరింది శ్రీలంక ప్రభుత్వం. ఈ సమావేశాల్లో శ్రీలంకలో మానవ హక్కులు, జవాబుదారీతనం రికార్డుపై విచారణ జరపనున్నారు. ఈ రికార్డుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు శ్రీలంక కోర్ గ్రూప్, యూఎన్హెచ్ఆర్సీ సంయుక్త ప్రకటన చేశాయి.
తమ దేశానికి మద్దతు ఇవ్వాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కోరామని.. శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శి జయంత్ కోలోంబేజ్ అన్నారు. మద్దతు కోసం మొట్టమొదట భారత్‌ను కోరామని తెలిపారు. భారత్.. తమకు మద్దతు ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్టీటీఈ)తో శ్రీలంకకు జరిగిన యుద్ధంపై ఇంకా మాట్లాడు కుంటున్నాయి. అయితే ఇది అనవసర జోక్యం అవుతుంది. ప్రస్తుతం శ్రీలంక శాంతికరమైన ప్రజాస్వామ్య దేశం. యూఎన్హెచ్ఆర్సీ సమావేశాల్లో తమకు మద్దతు ఇవ్వమని రష్యా, చైనాను సైతం కోరతాం."