కరోనా వైరస్ సోకి బాధపడుతున్న వారికోసం చైనాలో జరుగుతున్న ల్యాంటర్న్ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన గాలా షోలో 8 మంది కళాకారులు ఓ ప్రత్యేక పద్యాన్ని ఆలపించారు. 800 మందికిపైగా ప్రాణాలు బలిగొని, 30 వేల మందికి పైగా సోకిన కరోనా వైరస్‌పై కలిసికట్టుగా పోరాడాలన్న ఉద్దేశంతో ఒక గంట పాటు గాలా షోను ఏర్పాటు చేశారు.
కరోనా బాధితులు కోసం ప్రత్యేక గీతం ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు...
చైనాస్ స్నిపర్ వార్ అంటూ సాగే పద్యాన్ని 8 మంది చైనీస్ నటీనటులు కలిసి చదివి వినిపించారు. అయితే.. ఆ షోకి ప్రేక్షకులు ఎవరూ హాజరు కాలేదు. చైనాలో 30 ఏళ్లుగా గాలాను నిర్వహిస్తున్నప్పటికీ.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని నిర్వాహకులు తెలిపారు. చైనీస్ లూనార్ మొదటి నెలలో 15వ రోజున ఏటా ల్యాంటర్న్ ఉత్సవం జరుపుతారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: 62.59శాతం పోలింగ్ నమోదు