తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఉగ్రరూపం: ఐరోపాలో 75 వేలు దాటిన మరణాలు - corona us death toll

వైరస్ తీవ్ర ప్రభావం చూపిన ఐరోపా దేశాల్లో మొత్తం మృతుల సంఖ్య 75 వేలు దాటింది. పాజిటివ్​ కేసుల సంఖ్య 9,10,000కు చేరువైంది. మూడు రోజుల అనంతరం స్పెయిన్​లో కరోనా మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. శనివారం 619 మంది మరణించారు.

coronavirus news
స్పెయిన్​లో మళ్లీ పెరిగిన కరోనా మరణాలు

By

Published : Apr 12, 2020, 5:52 PM IST

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. అమెరికా, ఐరోపా దేశాల్లో విలయతాండవం చేస్తోంది. స్పెయిన్​లో మరణాల సంఖ్య మూడు రోజుల అనంతరం మళ్లీ పెరిగింది. వైరస్ కారణంగా శనివారం 619 మంది మృతి చెందారు. ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 16,972కు పెరిగింది. కొత్తగా నమోదైన 4,167 కేసులతో కలిపి ఇప్పటివరకు 1,66,019 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

ఐరోపాలో ఉగ్రరూపం

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,09,000 మందికి పైగా చనిపోగా ఒక్క ఐరోపా నుంచే 75 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఆ దేశాల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిపేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ఐరోపా వ్యాప్తంగా ఇప్పటివరకు 9,09,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఇటలీలో 19 వేల మందికిపైగా మరణించారు.

ఇరాన్​లో

వైరస్​ కారణంగా ఇరాన్​లో మరో 117 మరణించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 4,474కు చేరింది. కొత్తగా నమోదైన 1,657 కేసులతో కలిపి మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 71,600 దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

ఇదీ చూడండి: చైనాలో మళ్లీ కరోనా ప్రకంపనలు- అమెరికాలో వికృత రూపం

ABOUT THE AUTHOR

...view details