తెలంగాణ

telangana

ETV Bharat / international

కొనసాగుతున్న రష్యా, సౌదీ చమురు యుద్ధం! - Saudi to raise oil exports

మే నెల నుంచి తమ చమురు ఎగుమతులను రోజుకు 10.6 మిలియన్ బ్యారెళ్లకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. దీనితో రష్యాతో జరుగుతున్న చమురు ధరల యుద్ధాన్ని మరింత రాజేసింది.

Saudi to raise oil exports to record levels as price war rages
కొనసాగుతున్న రష్యా, సౌదీ చమురు యుద్ధం!

By

Published : Mar 31, 2020, 8:19 AM IST

రష్యాతో ధరల యుద్ధాన్ని మరింత రాజేస్తూ... మే నుంచి తమ చమురు ఎగుమతులను రోజుకు 10.6 మిలియన్ బ్యారెళ్లకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఇందు కోసం ఇప్పటికే తన చమురు ఉత్పత్తిని 12.3 మిలియన్​ బీపీడీకి పెంచింది.

"మే నుంచి పెట్రోలియం ఎగుమతులను 600,000 బీపీడీ పెంచాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. కనుక మొత్తం ఎగుమతులు 10.6 మిలియన్ బీపీడీలకు పెరుగుతాయి."

- సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వశాఖ అధికారి

కరోనా ధాటికి ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి పడిపోయింది. మరోవైపు చమురుకు డిమాండ్ కూడా తగ్గింది. దీనితో చమురు ధరలు 17 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో 22.38 డాలర్లకు పడిపోయింది.

రష్యాతో జగడం

చమురు ధరలు భారీగా పడిపోవటానికి మొదటి కారణం సౌదీ అరేబియా, రష్యా మధ్య విభేదాలు. కరోనా వైరస్ నేపథ్యంలో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. ఫలితంగా ఒపెక్‌ దేశాలు గత గురువారం సమావేశమై ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. 2020 చివరి వరకు 1.5 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిపై కోత పెట్టాలని తీర్మానించాయి. గత డిసెంబర్‌లో నిర్ణయించిన చమురు ఉత్పత్తి కోతకు ఇది అదనం.

కానీ, ఒపెక్‌ దేశాలతోపాటు చమురు ఉత్పత్తిలో అతిపెద్ద దేశమైన రష్యా ఇందుకు ససేమిరా అంటోంది. ఇది సౌదీ అరేబియాకు ఇబ్బందికరంగా మారింది.

ఇప్పటికే పెంచింది

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా.... ఏప్రిల్​లో తమ చమురు ఉత్పత్తిని పెంచుతామని ఇంతకు ముందే ప్రకటించింది. ప్రపంచ మార్కెట్​కు అవసరమైన అదనపు చమురు ఉత్పత్తిని అందించడమే తమ లక్ష్యమని తెలిపింది. ఇందు కోసం దేశీయంగా సహజ వాయువు వినియోగం పెంచుతున్నట్లు ఆ దేశ ఇంధన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ప్రస్తుతం సౌదీ అరేబియా సుమారు 7.0 మిలియన్ బీపీడీ ఎగుమతి చేస్తోంది. గల్ఫ్ పొరుగు దేశమైన యూఏఈ కూడా వచ్చే నెల నుంచి కనీసం ఒక మిలియన్​ బీపీడీని పెంచుతామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:ప్రీ పెయిడ్​ వినియోగదారులకు శుభవార్త.. వ్యాలిడిటీ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details