కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించడంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 91.4% సామర్థ్యం కలిగి ఉందని, తీవ్రమైన కరోనా కేసుల్లో 100% ఫలితాన్ని చూపిందని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమాలేయా సెంటర్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ప్రకటించాయి. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత వచ్చిన తుది ఫలితాల ఆధారంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 91.4% ఫలితాలను ఇచ్చిందని తెలిపాయి. ఈ ఫలితాల ఆధారంగా ఒక నివేదికను తయారు చేసి, వివిధ దేశాల్లో టీకా అనుమతులకు దరఖాస్తు చేయనున్నట్లు వివరించాయి.
'స్పుత్నిక్ వి' టీకా 91.4శాతం ప్రభావవంతం - russia sputnik v vaccine efficacy
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకా 91.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది. మొదటి డోసు ఇచ్చిన 21రోజుల తర్వాత వచ్చిన తుది ఫలితాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించాయి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమాలేయా సెంటర్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. వివిధ దేశాల్లో టీకా అనుమతులకు దరఖాస్తు చేయనున్నట్లు వివరించాయి.
'స్పుత్నిక్ వి' టీకా 91.4శాతం ప్రభావవంతం
గమాలేయా సెంటర్ వ్యాక్సిన్ సామర్థ్యంపై వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, ప్రపంచ జనాభాకు వ్యాక్సిన్ అందించడం ద్వారా కొవిడ్‌కు ముగింపు పలకవచ్చని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో పేర్కొన్నారు.