కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఆ దిశగా పలు దేశాల్లో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 12న తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.
ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న టీకాను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఒలెగ్ గ్రిడ్నేవ్.
" గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ ఆగస్టు 12న విడుదల చేయనున్నాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ట్రయల్స్ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం."