న్యూజిలాండ్ కైస్ట్చర్చ్ ప్రాంతంలోని ఓ మసీదులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా సమాచారం.
కాల్పుల్లో 9 మంది మృతి..! - బంగ్లాదేశ్ క్రికెటర్లు
న్యూజిలాండ్‌లోని ఓ మసీదులో జరిగిన కాల్పుల నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించినట్లు స్థానిక మీడియా చెబుతోంది.
అయితే ఆ దేశంలో పర్యటిస్తోన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సురక్షితంగా బయటపడింది. కాల్పుల సమయంలో క్రికెటర్లు బస్సులోనే ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. శుక్రవారం ప్రార్థన నిమిత్తం క్రికెటర్లు మసీదుకు వెళ్లినట్లు జలాల్ పేర్కొన్నారు. ఇకపై హోటల్లో ఉండాలని ఆటగాళ్లను కోరినట్లు ఆయన తెలిపారు. ఇది భయపెట్టే అనుభవమని బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు.
అయితే దుండగుడి కాల్పుల్లో ఎంత మంది చనిపోయారు, క్షతగాత్రులయ్యారు అనే విషయం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. పరారైన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.