జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోకు 1000 కిలోమీటర్ల దూరంలోని ఓగాసవరా ద్వీపంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి.
జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదు - జపాన్ ఓగాసవర ద్వీపంలో భూకంపం
జపాన్ దక్షిణ టోక్యోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
6.9 తీవ్రతతో జపాన్‌లో భారీ భూకంపం..
సముద్ర మట్టానికి 450 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపిన అధికారులు.. దీని వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.
సముద్ర పర్వతాలతో ఏర్పడిన ఈ ద్వీపాన్ని బోనిన్ ద్వీపమని కూడా పిలుస్తారు. ఈ ద్వీపం యునెస్కో గుర్తింపు పొందింది.