హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జినుహా కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్యాసోలీన్ బాంబులు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
వాన్ చాయ్ ప్రాంతం పక్కనే ఉన్న జినుహా వార్తా కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. తలుపులను, కిటికీలను ధ్వంసం చేశారు. ఎరుపు, నలుపు పెయింట్‌ను జల్లారు. గ్రాఫిటీ పెయింట్లు వేశారు. ఆఫీసు వరండాలో మంట పెట్టారు.
1997 సంవత్సరంలో హాంకాంగ్‌ను బ్రిటన్.. చైనాకు వెనక్కి ఇచ్చిన సమయంలో.. హామి మేరకు ప్రవర్తించకుండా.. తమకు స్వేచ్ఛను ఇవ్వకుండా డ్రాగన్ దేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు ఈ ద్వీప వాసులు. చైనా బ్యాంకులు, వ్యాపారాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.