తెలంగాణ

telangana

ETV Bharat / international

జులై 22న ఇమ్రాన్​ఖాన్, ట్రంప్ భేటీ షురూ! - ఐరాస

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ​ట్రంప్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జులై 22న ఇరువురు నేతలు సమావేశమై... ఉగ్రవాద నిర్మూలన, దక్షిణాసియాలో శాంతిస్థాపన సహా పలు అంశాలపై చర్చిస్తారని శ్వేతసౌధం తెలిపింది.

జులై 22న ఇమ్రాన్​ఖాన్, ట్రంప్ భేటీ షురూ!

By

Published : Jul 11, 2019, 5:18 AM IST

Updated : Jul 11, 2019, 7:36 AM IST

జులై 22న ఇమ్రాన్​ఖాన్, ట్రంప్ భేటీ షురూ!

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ జులై 22న వాషింగ్టన్​లో సమావేశమవుతారని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ భేటీలో ఇరువురు నేతలు.. ఉగ్రవాదం నిర్మూలన, దక్షిణాసియాలో శాంతిస్థాపన సహా పలు అంశాలపై చర్చిస్తారని తెలిపింది.

దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సు సాధించే క్రమంలో... అమెరికా, పాకిస్థాన్ మధ్య​ పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఇరువురు నేతలు దృష్టి సారించనున్నారు.

"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​... ఉగ్రవాద నిర్మూలన, రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఇరుదేశాల మధ్య పరస్పరం సహకారం బలోపేతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తారు."-శ్వేతసౌధం ప్రకటన

ఇమ్రాన్​ఖాన్​ మొదటి పర్యటన

పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్... అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఆహ్వానం మేరకు మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని పీఠం అధిరోహించిన తరువాత మొదటిసారి ట్రంప్​తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పాక్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

అమెరికా పర్యటనలో ఇమ్రాన్​ఖాన్​ వెంట పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ, ఇతర నాయకులూ వెళ్లనున్నారు.

ఐరాసలో ప్రాతినిధ్యం..

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 74వ సెషన్​లో పాకిస్థాన్​కు ప్రాతినిధ్యం వహించడానికి ఇమ్రాన్​ఖాన్​ సెప్టెంబర్​లో న్యూయార్క్ వెళ్లనున్నారు. 2018 ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇమ్రాన్​ఖాన్​కు ఇదే మొదటి యూఎన్​జీఏ సెషన్​.

ఇదీ చూడండి: కోహ్లీ, ధోని అప్పుడు ఇప్పుడు ఒకేలా..!

Last Updated : Jul 11, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details