తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్ రాజకీయ సంక్షోభం మరింత తీవ్రం - కేపీ శర్మ ప్రచండల మధ్య పెరుగుతున్న దూరం

నేపాల్​ అధికారిక కమ్యూనిస్టు పార్టీ (ఎన్​సీపీ)లో కీలక నేతలు ప్రధాని కేపీ శర్మ ఓలి, ఛైర్​పర్సన్ ప్రచండ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఎన్​సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశం 9వ సారీ వాయిదా పడింది. అయితే ఓలి లేకుండానే ప్రచండ వర్గం.. సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

Political crisis in Nepal
నేపాల్ రాజకీయ సంక్షోభం

By

Published : Jul 28, 2020, 6:33 PM IST

నేపాల్​లో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. అధికార నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్​ పుష్ప కమల్ దహల్ "ప్రచండ" ఏక పక్షంగా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి లేకుండా.. ప్రధాని అధికారిక నివాసంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

నిజానికి మంగళవారం ఉదయం 11 గంటలకు 45 మంది సభ్యులతో కూడిన కీలక స్టాండింగ్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే 9వ సారి కూడా ఈ సమావేశం వాయిదా పడింది.

ఇరువురు నాయకుల మధ్య తలెత్తిన వివాదాలను అనధికారిక సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు మరింత సమయం అవసరమని స్టాండింగ్ కమిటీ సభ్యులైన గణేశ్​ షా తెలిపారు. ఇందుకోసమే సమావేశం వాయిదా వేసినట్లు వివరించారు.

ప్రధాన మంత్రి ఓలి మీడియా సలహాదారు.. సూర్య తాపా ఈ విషయాన్ని ఫేస్​బుక్ ద్వారా వెల్లడించారు. ఇరువురు నేతలు సంప్రదింపులకోసం మరింత సమయం కోరుకుంటున్నట్లు తెలిపారు. సంప్రదింపులు పూర్తయిన తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించే తేదీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు.

విబేధాలు

అధికారం పంచుకునే విషయంలో ప్రచండ, ఓలీ మధ్య కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో విబేధాలున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఎన్​సీపీ స్టాండింగ్ కమిటీ ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది.

ఈ సమస్యల పరిష్కారం కోసమే స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. కానీ ఏదో ఓ కారణంతో ఈ సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కొన్ని సార్లు సమావేశం నిర్వహించినా.. వరదలు, కరోనా వంటి అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయి.

ఇంతకు ముందు జరిగిన సమావేశాలకు ప్రధాని ఓలి హాజరు కాకపోవడం వల్ల ప్రచండ వర్గం ఆయనపై బహిరంగంగానే విమర్శలు కూడా చేసింది.

ఇవీ చూడండి:ఓలి-ప్రచండ మధ్య రాజీకి ఎన్​సీపీ విఫలయత్నం

'ప్రధాని మొండి ప్రవర్తన వల్లే పార్టీలో చీలికలు'

ABOUT THE AUTHOR

...view details