తెలంగాణ

telangana

ETV Bharat / international

భూటాన్​ విద్యార్థులకు ప్రధాని మోదీ 'క్లాస్​' - రాయల్​ విశ్వవిద్యాలయ

భూటాన్​ థింపూలోని రాయల్​ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. సృజనాత్మకతే ఆయుధంగా... అవరోధాల్ని అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల కాలంలో భారత్​లో వేర్వేరు రంగాల్లో వచ్చిన మార్పులను వివరించారు.

భూటాన్​ విద్యార్థులకు ప్రధాని మోదీ 'క్లాస్​'

By

Published : Aug 18, 2019, 10:45 AM IST

Updated : Sep 27, 2019, 9:17 AM IST

రానున్న అనేక తరాలపై ప్రభావం చూపగల స్థాయిలో అసాధారణ పనులు చేయగల సత్తా యువత సొంతమని కొనియాడారు ప్రధాని నరేంద్రమోదీ. ఎలాంటి పరిమితులు లేకుండా, లక్ష్య సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

భూటాన్​ పర్యటనలో భాగంగా థింపూలోని రాయల్​ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

పర్యటకుల పట్ల భూటాన్​ వాసులు చూపే ఆప్యాయతను ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ. భారత్​-భూటాన్​ మధ్య బంధం మరింత దృఢపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

అంకుర సంస్థలకు భారత్​ అత్యంత అనువైన దేశంగా మారిందని చెప్పారు మోదీ. విద్య, వైద్యం, ఇతర రంగాల్లో భారత్​లో వచ్చిన మార్పులను భూటాన్​ విద్యార్థులకు వివరించారు.

ప్రధాని నరేంద్రమోదీ

"ఆయుష్మాన్​ భారత్​తో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు భారత్​ కేంద్రంగా ఉంది. 50 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నాం. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే డేటా అందిస్తున్నాం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల మందికి సాధికారత లభిస్తోంది."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: భూటాన్​ రుచులతో మోదీకి పసందైన విందు!

Last Updated : Sep 27, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details